భారీ వర్షాల దృష్ట్యా అనంతపురంలోని మొదటి రోడ్డులో ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు నగర ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న పునరావాస కేంద్ర పనులను బుధవారం కలెక్టర్ వినోద్ కుమార్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నగరంలోని 6వ రోడ్ నడిమి వంక, సోమనాథ్ నగర్, తపోవనం బైపాస్, యువజన కాలనీ, కొవ్వూరు నగర్ బైపాస్‌లో, నడిమి వంక, డా. బీఆర్ అంబేడ్కర్ ఫ్లైఓవర్ పక్కన ఉన్న డ్రైనేజీలో పూడికతీత పనులను పరిశీలించారు.