రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ను అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సోమవారం కలిశారు. కర్నూలులోని మంత్రి నివాసంలో కలిసి జిల్లాలో సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. అనంతపురం నగరాన్ని పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దాలని కోరారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.