అనంతపురం జిల్లాలోని సాగునీటి వనరుల అభివృద్ధి కోసం అధికారులు ప్రతిపాదనలకే పరిమితం కాకుండా నిధులు రాబట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ పేర్కొన్నారు. పీఏబీఆర్ రిజర్వాయర్ ను 11. 10 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని నిర్ణయించి 3 దశాబ్దాలైనా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం మరోసారి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసిందని, ప్రతిపాదనలే కాక నిధుల మంజూరుకు ప్రయత్నించాలన్నారు.