ఉదయగిరి నెల్లూరు జిల్లా కేంద్రానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. జిల్లాలోనే పెద్ద నియోజకవర్గం అయినప్పటికీ ఎటువంటి అభివృద్ధి లేదు. ఉదయగిరి చుట్టుపక్కల మొత్తం మెట్ట ప్రాంతం, సాగు చేయడానికి నీరు లేక, చేయడానికి పని లేక, చదువుకున్న వారికి ఉద్యోగాలు రాక ఇటుపక్క ప్రాంత ప్రజలందరూ వలసలు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి ఉదయగిరిలో గురువారం భారీ స్థాయిలో నిరసనలు చేశారు.