ఉదయగిరి: సబ్ ట్రెజరీ కార్యాలయ సిబ్బందికి సూచనలు

59பார்த்தது
ఉదయగిరి: సబ్ ట్రెజరీ కార్యాలయ సిబ్బందికి సూచనలు
ఉదయగిరిలోని ఉప ఖజానా కార్యాలయంలో విధులు నిర్వహించే సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని నెల్లూరు ఏటీఓ లోకేష్ బాబు హెచ్చరించారు. ఉదయగిరి సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఎటువంటి సమస్యలు ఉండకూడదని అన్నారు. కార్యాలయానికి వచ్చే పెన్షనర్లు, ఉద్యోగులపట్ల మర్యాదగా ప్రవర్తించాలన్నారు.

தொடர்புடைய செய்தி