యువత చదువుతోపాటు క్రీడల్లోను రాణించాలని మాజీ జడ్పిటిసి సభ్యుడు కే. వెంకటేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. క్రిస్మస్ సందర్భంగా సీతారాంపురం మండలంలోని బసినేనిపల్లిలో మెగా క్రికెట్ టోర్నమెంట్ ను ఆదివారం ప్రారంభించారు. గెలుపొందిన క్రీడాకారులకు మొదటి బహుమతి రూ. 20, 116, ద్వితీయ బహుమతి రూ. 10, 116, తృతీయ బహుమతి రూ. 5, 116 అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో రమణారెడ్డి, గోవిందు, ఏసుదాసు పాల్గొన్నారు.