జలదంకి మండలం వేములపాడు లో అక్రమ మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఎక్సైజ్ సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం. ఆదివారం కావలి ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వేములపాడు కు చెందిన జయరాములు అనే వ్యక్తి వద్ద నుంచి 11 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్సై దేవిక, సిబ్బంది పాల్గొన్నారు.