కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం దుత్తలూరు కొండపై గల శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక పౌర్ణమి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మంగళవారం తెలిపారు. ఆరోజున జరిగే వనభోజనాలకు చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాదిమంది భక్తులు పాల్గొంటారు. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి నడయాడిన ఈ శిఖరాన్ని తిలకించేందుకు పర్యాటకులు ఉత్సాహం చూపడం విశేషం.