మందకృష్ణ మాదిగపై జనసేన నేతలు ఫైర్ అయ్యారు. బుధవారం వెంకటాచలం మండల ప్రధాన కార్యదర్శి కాకి శివ కుమార్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ అన్ని వర్గాలకు సమాన న్యాయం అందిస్తున్నారని, ఆయనకు కులాలను కలపడమే తెలుసన్నారు. మందకృష్ణ మాదిగ జనసేన నుంచి మాదిగలను, మాలలను దూరం చేసే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రవి, శ్రీహరి, చెంచయ్య, అఖిల్, తదితరులు పాల్గొన్నారు.