వెంకటాచలం మండలంలోని కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ వ్యాపార నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో ఎస్ పి ఎస్ ఎస్ ఉపయోగించి డేటా విశ్లేషణ" అనే అంశంపై వారం రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ను సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్. విజయభాస్కర రావు హాజరయ్యారు. విశిష్ట అతిథిగా రిజిస్ట్రార్ డాక్టర్ కే. సునీత హాజరయ్యారు.