నెల్లూరు జిల్లా ఉలవపాడులోని మూడవ వార్డు రిజర్వ్ కాలనీ ఏర్పడి 70 సంవత్సరాలు అయిన ఇప్పటివరకు రోడ్లు వేయకపోవడం దుర్మార్గమని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా స్పందించి పంచాయతీ సెక్రటరీ తమ బాధలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి కాలనీలో రోడ్లు సైడు కాలువలు వచ్చేలా చూడాలని కోరుతున్నారు. వర్షాలు పడితే ఊహించడానికి కూడా దారుణంగా ఈ ప్రాంతం మారుతుంది.