నెల్లూరు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నందు ఫూలే టీచర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ నాయకులు అదనపు సంచాలకులు గ్లోరిని శుక్రవారం కలిసారు. వారు మాట్లాడుతూ.. పాఠశాలల పనివేళల్లో మార్పులు వద్దని, ప్రస్తుతం అమలవుతున్న పాఠశాలల వేళలను యధావిధిగా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ర్ట అధ్యక్షులు అన్నం శ్రీనివాసులు, రాష్ర్ట ప్రధాన కార్యదర్శి వాసిలి సురేష్, రాష్ర్ట ఆర్థిక కార్యదర్శి తుమ్మా రవి, తదితరులు పాల్గొన్నారు.