నెల్లూరు రూరల్ కు సంబంధించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జన్ని రమణయ్యను మాదిగ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గా నియమించారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలంగా జన్ని రమణయ్య పని చేస్తూ ఆ పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు. ఆయనకు పదవి దక్కడంపై పలువురు అభినందనలు తెలియజేశారు.