జనసేన రాష్ట్ర నేత కొణిదెల నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రకటించడంతో నెల్లూరులో జనసేన నేతలు, కార్యకర్తలు సోమవారం రాత్రి సంబరాలు చేసుకున్నారు. పెద్ద ఎత్తున బాణ సంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, దుగ్గిశెట్టి సుజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.