జిల్లాలో వర్షాల కారణంగా ప్రాణనష్టంగాని, పశునష్టం జరగకూడదని కలెక్టర్ తెలిపారు. ఆయన అధికారులు సూచనలు చేశారు. బోట్లు , జె సి బిలు సిద్ధంగా ఉంచుకోవాలి. నిత్యావసరాలు, ఆహార పదార్థాలు, డీజిల్ సిద్ధంగా ఉంచాలి. గ్రామాలలో తాగునీటి ట్యాంకులలో ముందుగానే నీటి నింపుకొవాలి. జిల్లా స్థాయి నుండి గ్రామస్థాయి వరకు సెలవులు ఉన్న అధికారులు, సిబ్బంది సెలవులు రద్దు చేసుకుని హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలి అన్నారు.