కావలి మున్సిపల్ కమిషనర్ ని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి గురువారం కలిశారు. తనపై పచ్చ మీడియా చేస్తున్న విషప్రచారాలపై ప్రజలకు నిజానిజాలు తెలియాలని మున్సిపల్ కార్యాలయానికి రావడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. 2019 నుండి 2024 వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 128 ఎకరాలు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కాలువలు, గుంటలు ఆక్యుపై చేసి లేఅవుట్లు వేసి అమ్మి వేసినట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే అన్నారు.