నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల జలాశయం నిండుకుండలా మారింది. ఈ జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 72. 809 టిఎంసిల నీటిమట్టం ఉంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న కారణంగా 4, 126 క్యూసెక్కుల వరదనీరు జలాశయానికి వచ్చి చేరుతుంది. పెన్నా డెల్టాకు 1500, కండలేరు 1200 క్యూసిక్కుల నీటిని దిగువగు విడుదల చేస్తున్నారు. ఈ వివరాలను జలాశయం అధికారి ఆదివారం విడుదల చేశారు.