ఏఎస్ పేట మండల కేంద్రం రహమదాబాద్ లోని హజరత్ సయ్యద్ ఖాజా రహమతుల్లా నాయక్ రసూల్ సోమల వారి దర్గా ఈవో షేక్. మహమ్మద్ హుస్సేన్, సిబ్బంది ఆదివారం రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ను ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్ర చైర్మన్ గా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలిపారు. దర్గా ఈవో అబ్దుల్ అజీజ్ కు పలు విషయాలు తెలిపారు. దర్గా అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తారని అజీజ్ తెలిపారు.