ప్రకాశం జిల్లా, దోర్నాల మండలం పెద్ద దోర్నాలలో మద్యం బెల్టు షాపు నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని శుక్రవారం స్థానిక ఎస్సై మహేష్ అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 15 క్వార్టర్ల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై తెలిపారు. మద్యం బెల్టు షాపు నిర్వహిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశామని మహేష్ చెప్పారు. మద్యం బెల్టు షాపులు నిర్వహించడం చట్టరీత్యా నేరమని ఎస్సై ప్రజలను హెచ్చరించారు.