సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని నాగులప్పలపాడు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. నాగులుప్పలపాడు మండలం నిడమనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఎస్సై శ్రీకాంత్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో సమావేశమైన ఎస్సై సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలపై చైతన్యవంతులు కావలసిన అవసరం ఉందని తెలిపారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా భవిష్యత్ పౌరులుగా తీర్చిదిద్దబడాలన్నారు.