ఒంగోలు: హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి
ఒంగోలు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ కోమటినేని విజయ్ కృష్ణ సోమవారం మృతి చెందారు. విధులు ముగించుకొని ఇంటికి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుంటుండగా అకస్మాత్తుగా కింద పడిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు విజయకృష్ణను వైద్యశాలకు తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ మృతి వార్త తెలుసుకున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.