మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్ లో బుధవారం స్వయం సహాయక సంఘాల ప్రొఫైలింగ్ యాప్ నిర్వహణపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ మహిళా సాధికారతకు స్వయం సహాయక సంఘాలు కృషి చేయాలని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.