మార్కాపురం: సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన

69பார்த்தது
మార్కాపురం: సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన
పెద్దారవీడు మండలం గుండంచర్లకు చెందిన పశువుల కాపర్లు మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద శనివారం నిరసనకు దిగారు. పశువుల మేత కోసం వెళ్లిన వెంకటేశ్వర్లపై అటవీశాఖ అధికారులు దాడి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశువుల కాపరిని కొట్టిన అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ కు పశువుల కాపర్లు వినతి పత్రాన్ని సమర్పించారు. ఘటనపై సబ్ కలెక్టర్ విచారణ జరుకుతామన్నారు.

தொடர்புடைய செய்தி