ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఇటీవల తొలగించిన ఆక్రమణల ప్రాంతాలను శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. ఆక్రమణల తొలగింపులో ఉపాధి కోల్పోయిన చిరు వ్యాపారులకు ఉపాధి కల్పించే మార్గాలు అన్వేషిస్తున్నామని ఎమ్మెల్యే నారాయణరెడ్డి తెలిపారు. ఇంకా మరి కొన్ని ప్రాంతాలలో ఆక్రమణలు తొలగించవలసి ఉందన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులతో పాటు అధికారులు పాల్గొన్నారు.