సింగరాయకొండ: రౌడీ షీటర్ ఆత్మహత్య యత్నం
తాగిన మైకంలో రౌడీ షీటర్ శివ మహేష్ ఆత్మహత్యకు యత్నించిన సంఘటన ఆదివారం ప్రకాశం జిల్లా సింగరాయకొండలో చోటు చేసుకుంది. బ్లేడుతో శివ మహేష్ తన గొంతును కోసుకున్నాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్ ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి శివ మహేష్ ను తరలించారు. తాగిన మైకంలోనే రౌడీషీటర్ శివ మహేష్ బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడని పోలీసులు విచారణ అనంతరం తెలిపారు.