సింగరాయకొండ మండలం పాకాల బీచ్ వద్ద శుక్రవారం కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ప్రజలు సముద్ర స్నానాలు ఆచరించారు. సముద్రం ఒడ్డున మహాశివుడికి పూజలు నిర్వహించి అనంతరం సముద్రంలో స్నానమాచరించారు. భక్తుల తాకిడి అధికంగా ఉండడంతో స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. బీచ్ లో ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ భద్రతలు ఏర్పాటు చేశారు. సముద్ర స్నానాల వల్ల పుణ్యం కలుగుతుందని అర్చకులు చెబుతున్నారు.