పొన్నలూరు మండలం లోని ఉప్పలదిన్నె గ్రామంలో కొండేపి నియోజకవర్గ ఇంచార్జి వరికూటి అశోక్ బాబు పర్యటించారు. ఈ సందర్బంగా ఉప్పలదిన్నె గ్రామ సర్పంచ్ మన్నం పద్మ వెంకటేశ్వర్లు నివాసంలో కాఫీ విత్ గృహ సారధి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గృహ సారథులుగా నియమితులైన వారు తమ క్లస్టర్ పరిధిలో వలంటీర్లతో కలిసి ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఆయన అన్నారు. గృహ సారథికి ప్రభుత్వ ఉచితంగా బీమా సౌకర్యం కల్పించిందని, పార్టీలో తగిన ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.