పొన్నలూరు మండలంలోని కోటపాడు గ్రామ సచివాలయ పరిధిలో గృహ సారధులకు, సచివాలయ కన్వీనర్లకు జగనన్నే మా నమ్మకం, జగన్ననే మా భవిష్యత్ కార్యక్రమం పై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. మండల ఎంపీపీ కొండబత్తిన మాధవ, మండల వైసీపీ కన్వీనర్ పల్నాటి వెంకటేశ్వర రెడ్డి, సచివాలయ జేసిఎస్ కన్వీనర్ పిల్లి తిరుపతి రెడ్డి, ఆధ్వర్యంలో అవగాహనా ఏర్పరిచారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాధవరావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పధకాల గురించి ప్రతి ఇంటికి వివరించి ఏ ఒక్క అర్హునికి కూడా అన్యాయం జరగకుండా ఉండేలా చూసుకోవాలన్నారు.