విద్యుత్ అదాలత్ ద్వారా విద్యుత్ సమస్యలు పరిష్కరించుకోవాలని సిజిఆర్ఎఫ్ చైర్ పర్సన్ ఇమ్మానియేల్ తెలిపారు. విద్యుత్ అదాలత్ కార్యక్రమాన్ని కనిగిరి పట్టణంలోని విద్యుత్ డివిజన్ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇమ్మానుయేల్ పాల్గొని వినియోగదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సంబంధిత ఉద్యోగులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఈ వీరయ్య పాల్గొన్నారు.