వెలిగండ్ల మండలంలోని కంకణంపాడు గ్రామంలో సర్వే నంబర్ 337/2 లో 0. 04 సెంట్లు గ్రామ కంఠము స్థలాన్ని కొందరు ఆక్రమణదారులు రాత్రికి రాత్రే రేకులు వేసి బంకును ఏర్పాటు చేసి ఆక్రమణ చేశారని గ్రామస్తులు ఎంపీడీవో సుకుమార్ కు సోమవారం ఫిర్యాదు చేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ లక్షల రూపాయల విలువైన గ్రామకంఠమ స్థలాన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగించుకోవాలని కోరారు. ఎంపీడీవో తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.