కార్తీక పౌర్ణమి సందర్భంగా చంద్రశేఖరపురం మండలంలోని భైరవకోనలో భక్తులు శుక్రవారం పోటెత్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు, పర్యాటకులు భారీగా తరలివచ్చారు. జలపాతం వద్ద స్నానాలు చేసి కార్తీక దీపాలు వెలిగించారు. త్రిముఖ దుర్గాంబ దేవుడిని దర్శించుకున్నారు. భక్తులకు అన్నదానం చేశారు.