గిద్దలూరు: బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్
ప్రకాశం జిల్లా, గిద్దలూరు ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్ నిషా కుమారి శుక్రవారం అటవీ శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గతంలో విధులు నిర్వహిస్తున్న ప్రాజెక్టు టైగర్ డిప్యూటీ డైరెక్టర్ నరసింహారావు బదిలీపై మార్కాపురం వెళ్లారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నిషా కుమారిని అటవీశాఖ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత ఒక్కొక్కరుగా ఆమెను పరిచయం చేసుకున్నారు.