గిద్దలూరు: నిలిచిపోయిన ఆక్రమణల తొలగింపు

81பார்த்தது
గిద్దలూరు: నిలిచిపోయిన ఆక్రమణల తొలగింపు
గిద్దలూరు లోని జాతీయ రహదారిపై రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణల తొలగింపు నిలిచిపోయింది. 15 రోజుల క్రితం అధికారులు ఆక్రమణలను తొలగించే కార్యక్రమంలో భాగంగా చిరు వ్యాపారులకు నోటీసులు ఇచ్చారు. 25 సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆక్రమణలను తొలగించే కార్యక్రమానికి బుధవారం స్టే విధించింది. దీంతో ఆక్రమణ తొలగింపు కార్యక్రమం నిలిచిపోయినట్లుగా అధికారులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி