గిద్దలూరు పట్టణంలోని శ్రీ భగీరథ ఆలయం వద్ద శ్రీ భగీరథ సగర సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అంగరంగ వైభవంగ వనభోజన మహోత్సవాలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, మార్కాపురం జనసేన ఇన్చార్జి ఇమ్మడి కాశీనాథ్, సగర ప్రముఖులు, మేధావులు హాజరయ్యారు. గిద్దలూరు, కొమరోలు, రాచర్ల మండలాల నుంచి సగర ప్రజలు పెద్ద ఎత్తున కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు.