ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల మండలానికి చెందిన శంకర్ అనే జనసైనికుడు మాజీ సీఎం జగన్ ను ప్రశ్నించాడు. సోమవారం ఓ పాంప్లెట్ ను ప్రదర్శిస్తూ అసెంబ్లీ కి రాని జగన్ కు జీతం ఎందుకు అని నిలదీశాడు. ప్రతిపక్ష హోదా లేకపోతే అసెంబ్లీకి రాలేవా అని ఎద్దేవా చేశాడు. జన సైనికుడు మాజీ సీఎంని ప్రశ్నిస్తూ పాంప్లెట్ ను ప్రదర్శించడంతో వైసిపి నాయకులు, కార్యకర్తలు అతనిపై మండిపడుతున్నారు.