దర్శి నియోజకవర్గ ఎంఆర్పిఎస్ ఇన్ఛార్జ్ గూడూరి యోగేశ్వర రావు పై దాడి చేయించిన ముద్దాయిలపై వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దళిత సేవ ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. దర్శిలోని ప్రభుత్వ వైద్యశాలలో గురువారం చికిత్స పొందుతున్న రాష్ట్ర దళిత సేన ఇన్ఛార్జ్ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో ఆయనను పరామర్శించారు. దాడి చేయించిన హెచ్ఎం అంజలి దేవి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు.