ముండ్లమూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముండ్లమూరు ఎస్సై నాగరాజు విద్యార్థులకు సైబర్ నేరాలపైన మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయని, వాటి నుండి మనల్ని మనం రక్షించుకోవాలని తెలిపారు. వ్యక్తిగత వివరాలు అపరిచిత వ్యక్తులకు చెప్పకూడదన్నారు. విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు.