దొనకొండ మండలంలోని బాధాపురంలో గత నెల 27వ తేదీన విద్యుత్ షాక్ కు గురైన బాలుడు సోమవారం రాత్రి మృతి చెందాడు. గ్రామానికి చెందిన చరణ్ పాఠశాల భవనంపై ఆడుకుంటూ విద్యుత్ తీగలు తగలడంతో షాక్ కు గురయ్యాడు. వెంటనే గుంటూరు ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. నెలరోజులు మృత్యువుతో పోరాడిన ఆ బాలుడు సోమవారం రాత్రి చనిపోయాడు. దీంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.