అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం ను ముండ్లమూడు పోలీసులు గురువారం పట్టుకున్నారు. ముండ్లమూరు మండలం మారెళ్ళ గ్రామంలోని కూరగాయల దుకాణంలో అక్రమంగా మద్యం బాటిళ్లు ఉన్నట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి వాటిని పట్టుకున్నారు. మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కూరగాయల దుకాణం యజమానిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రమంగా మద్యాన్ని విక్రయించటం నేరమని హెచ్చరించారు.