అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. కురిచేడు మండలం పడమర వీరాయపాలెం గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న మురళీకృష్ణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 15 విస్కీ మధ్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లుగా ఎక్సైజ్ శాఖ ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు.