ఒంగోలు: టేబుల్ టెన్నిస్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
ఒంగోలు నగరంలోని మినీ స్టేడియంలో రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలను ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని వారు తెలిపారు. గెలుపోటములను క్రీడా స్ఫూర్తితో స్వీకరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు, నిర్వాహకులు పాల్గొన్నారు.