ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో శుక్రవారం పోలీసులు ట్రాఫిక్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ముఖ్యంగా రోడ్డుకు ఇరువైపులా వాహనాలను అడ్డంపెట్టి ఇబ్బందులు కలిగిస్తున్న వాహనదారులకు ఎస్సైలు సైదులు, హారుణ్ జరిమానాలు విధించారు. ట్రాఫిక్ కు ఆటంకాలు కలిగిస్తున్న వాహనదారులకు ఎస్ఐలు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారీ జరిమానా తప్పదని వాహనదారులను హెచ్చరించారు.