సింగరాయకొండలోని ప్రభుత్వ వసతి గృహాలను మంగళవారం జూనియర్ సివిల్ జడ్జి నిఖిల్ రెడ్డి తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. మెనూ ప్రకారం ఆహారాన్ని అందిస్తున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు నివసిస్తున్న ప్రాంతాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని జడ్జి వారికి సూచనలు ఇచ్చారు.