ఏపీలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. ఇకపై కళాశాల యాజమాన్యాల ఖాతాలకే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులు చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం తల్లి ఖాతాలో నగదు జమ చేసే విధానం తెచ్చి ఫీజులు చెల్లించకుండా ఎగ్గొట్టిందని అసెంబ్లీలో శుక్రవారం మంత్రి ఆరోపించారు.