లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని జూనియర్ సివిల్ జడ్జి భరత్ చంద్ర తెలిపారు. కనిగిరిలోని జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో కోర్టు పరిధిలోని పోలీసు సిబ్బందితో సోమవారం జడ్జి భరత్ చంద్ర సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 14వ తేదీన జరిగే లోక్ అదాలత్ పై వారి ప్రతివాదులకు అవగాహన కల్పించి సద్వినియోగం చేసుకునేలా చూడాలని ఆయన సూచించారు. రాజీమార్గంలో కేసులను పరిష్కరించుకునే విధంగా చూడాలన్నారు.