పేదల సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తామని జిల్లా సిపిఎం కార్యదర్శి కంకణాల ఆంజనేయులు తెలిపారు. దర్శి పట్టణంలో సిపిఎం ఏడవ మహాసభలు మంగళవారం ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే పేదలకు అందుబాటులో లేకుండా నిత్యవసర ధరలు భగ్గుమంటున్నాయని తెలిపారు. విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలను రద్దు చేయాలని పేర్కొన్నారు.