అధికారంలోకి వచ్చి 4 నెలలు అయినప్పటికీ కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చలేదని దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొండారెడ్డి విమర్శించారు. దర్శిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు అమర్చే ప్రక్రియను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.