పత్రికలు ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలని జిల్లా పౌరసంబంధాల శాఖ అసిస్టెంట్ డైరక్టర్ రమేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శనివారం జరిగిన జాతీయ పత్రికా దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ సమాజానికి దిశా నిర్దేశం చేయడంలో పత్రికలు అద్వితీయ పాత్రను పోషిస్తాయని అన్నారు.