ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అవసరమైన మౌలిక సదుపాయాలను తక్షణమే కల్పించాలని ఇంజనీరింగ్ అధికారులకు విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య ఆదేశించారు. శనివారం కే. ఎల్. పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఆ కేంద్రానికి వెళ్లేందుకు సరైన రహదారి, చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడం వంటి సమస్యలను గుర్తించిన ఆయన ఆసుపత్రికి కావాల్సిన సదుపాయాలకు తగ్గ అంచనాలను రూపొందించాలని అధికారులకు ఆదేశించారు.