భగవాన్ బిర్సా ముండా త్యాగాన్ని తెలుసుకొని వారు చూపిన మార్గాన్ని అనుసరించి ఆదివాసీలు దేశం గర్వపడేలా ఎదగాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డా. బి. ఆర్. అంబేద్కర్ తెలిపారు. ఉన్నత చదువులు చదివి, ఉన్నత స్థాయి చేరుకున్న నాడే అందరి గుర్తింపు లభిస్తుందని అన్నారు. భగవాన్ బిర్సా ముండా 150 వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం కలెక్టరేట్ లో బిర్సా ముండా చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు